Tuesday, 3 November 2026

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొని బహుమతులు గెల్చుకోవాల్సిందిగా యువతి

జనం సాక్షి దుబ్బాక.హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేలుకొల్పే దిశగా రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన యువతి యువకులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని పేర్కొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇందులో పాల్గొనడానికి యువతి యువకుల వయస్సు 16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని తెలిపారు.జులై 1 తారీఖు వరకు 7661899899 ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. జూలై రెండవ తారీకు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందని ఇందులో 60 ప్రశ్నలకు 60 నిమిషాల సమయం ఇస్తారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం లో టాపర్ విద్యార్థినికి ఎలక్ట్రికల్ స్కూటీ బహుమతిగా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. మిగతా వారికి అనేకమైన బహుమతులు ఉన్నాయని తెలియజేశారు. అందులో మొదటి బహుమతి ల్యాప్ టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతి ఐ ప్యాడ్, నాలుగో బహుమతిగా 10 స్మార్ట్ వాచీలు, ఐదవ బహుమతిగా 10 ఇయర్ పాడ్లు, ఆరవ బహుమతిగా 10 హార్డ్ డ్రైవులు, ఏడవ బహుమతిగా 10 పవర్ బ్యాంకులు నియోజకవర్గంలోని యువతి యువకులకు ఇట్టి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి వెంకట స్వామి గౌడ్, కటికే అశోక్, అన్నబోయిన చంద్రశేఖర్, వడ్ల ప్రభాకర్, మహిళా నాయకురాలు సుమలత, మమ్ముగౌడ్, వేల్పుల యాదగిరి ముదిరాజ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజుల రమేష్, నర్సింలు, పంజా మహేందర్, చందు, అభిద్, తిప్పన బోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు.