హైదరాబాద్ : రాజేంద్రనగర్లోని శాస్త్రిపురంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు రూ. 50 లక్షల విలువ చేస్తాయని పోలీసులు తెలిపారు. గుట్కా ప్యాకెట్లు కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




