అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలిలో జేసీబీతో తవ్వుతుండగా నాటుబాంబులు బయటపడ్డాయి. దీంతో కోమలి గ్రామంలో కలకలం రేగింది. నాటుబాంబులో భూమిలో ఎవరు దాచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్ జిల్లా అయిన అనంతపురంలో ఈ నాటుబాంబులు వెలుగుచూడటం సంచలనం సృష్టించింది.




