Wednesday, 4 November 2026

రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్‌ ప్రమాణం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మర్‌ హమీద్‌ అన్సారీ తన ఛాంబర్‌లో ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోం నుంచి వరుసగా అయిదో సారి రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్‌ సింగ్‌ ఇటీవలే ఎన్నికయ్యారు. అసోం నుంచి రాజ్యసభకు ఎంపికైన మరో కాంగ్రెస్‌ సభ్యుడు సెంథియస్‌ కుమార్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *