రాజ్యాంగ స్ఫూర్తి అవార్డు అందుకున్న పరమేశ్వర్ కొలెట్కర్.
జనం సాక్షి ఉట్నూర్..
దిశా సేవా సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన టీఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఎస్ సిహెచ్ఇ చెర్మెన్ లింబాద్రి తెలంగాణ జర్నలిస్ట్ అకాడమీ చైర్మన్ నారాయణ టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంట చక్రపాణి దిశా సేవా సంస్థ చైర్మన్ గొల్లబోయిన అంబేద్కర్ చేతుల మీదుగా అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన కొలెట్కర్ పరమేశ్వర్ కి మెమొంటో ఇచ్చి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సేవా సంస్థ కార్యకర్తలు ఉన్నారు.




