Tuesday, 3 November 2026

రైతులందరూ పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవాలి,

రైతులందరూ పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవాలి, జనం సాక్షి పదర: వ్యవసాయ అధికారి సురేష్,పదర మండల కేంద్రంలో పరిధిలోని గ్రామాల రైతులందరూ పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవాలని పదర మండల వ్యవసాయ అధికారి సురేష్ రైతులకు సూచించారు, పదర మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మంగళవారం నాడు యాసంగి పంటలు, పీఎం కిసాన్, రైతు బంధు పై ఏర్పాటుచేసిన రైతుల సమావేశంలో రైతులకు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదర మండలంలో 1124 మంది పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోలేదని దీనివల్ల రైతుబంధు, పీఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం లేదని ఆయన తెలిపారు, రెండు వారాల్లో రైతులందరూ పీఎం కిసాన్ ఈకేవైసీ చేయించుకోవాలని అప్పుడు మాత్రమే రైతుబంధు, సీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో పడతాయని వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు, ఈ కార్యక్రమంలో ఏఈఓ, శ్రావణి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నీలం రాజు యాదవ్, నాయకులు గోలి శ్రీను, పెద్ది రాజు యాదవ్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.