Friday, 6 November 2026

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

మోత్కూరు నవంబర్ 26 జనంసాక్షి : రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా, పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ అన్నారు. శనివారం మండలంలోని పనకబండ, రాగిబావి గ్రామాలలో తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నెబోయిన రమేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కీ ఎక్కువ ఓట్లు వచ్చేటట్లు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు కొండ సోమలు, గ్రామ శాఖ అధ్యక్షులు లోతుకుంట స్వామి, పసునూరి సత్తిరెడ్డి, సర్పంచ్ లు బత్తిని తిరుమలేష్, రాంపాక, నాగయ్య, సింగల్ విండో డైరెక్టర్ కారిపోతుల ముత్యాలు, మాజీ సర్పంచ్ బత్తిని హనుమంతు, ఎలుగు వెంకటరెడ్డి, యాదిరెడ్డి, ఎన్నం మధుసూధన్ రెడ్డి,సోమిరెడ్డి, పొన్నెబోయిన మచ్చగిరి, లోతుకుంటగిరి,ముక్కామల అంజయ్య, లోతుకుంట నాగార్జున అప్పం జలంధర్ వల్లందాస్ సత్తయ్య ఎండి దస్తగిరి ఓర్సు ఇద్దయా పొన్నెబోయిన అంజయ్య లోతుకుంట అనిల్ రాంపాక రాములు రాంపాక మల్లేష్ బత్తిని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.