కన్నెపల్లి ఏపీఎం గా విజయలక్ష్మి.
బెల్లంపల్లి, నవంబర్ 25, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండల ఇంచార్జి ఏపీఎంగా విజయలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కన్నెపల్లి ఏపీఎం గా పని చేసిన దుర్గం అశోక్ బదిలీపై జిల్లా కార్యాలయానికి వెళ్లడంతో నెన్నెల ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మికి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఈసందర్భంగా ఏపీఎం విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంచార్జి స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. బాధ్యతలు చేపట్టిన ఏపీఎం విజయలక్ష్మిని ఐకేపీ సిబ్బంది అభినందనలు తెలిపారు.
కన్నెపల్లి ఏపీఎం గా విజయలక్ష్మి.




