రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గంగారం నవంబర్ 26 జనంసాక్షి : రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా, పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు ఇర్ప సూరయ్య అన్నారు. శనివారం మండలంలోని కుమట్ల గూడెం గ్రామాలలో ములుగు జిల్లా జడ్పిటిసి కుసుమ జగదీశ్వర్ ఆదేశానుసారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఇర్ఫా సూరయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కీ ఎక్కువ ఓట్లు వచ్చేటట్లు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మయ్య జంగాలపల్లి సర్పంచ్ బాలాజీ నాయక్, కోమట్లగూడెం సర్పంచ్ సుగుణ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




