ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం……
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 26
రాజంపేట్ మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి అన్నారు. ఇట్టి కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ, ప్రజలను మనుషులుగా గుర్తించారని, భారతదేశం పై సర్వహక్కులు భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించారని అన్నారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం చదివి ప్రజల యొక్క హక్కులను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి భారత రాజ్యాంగం ప్రవేశికను విద్యార్థులకు చదివి రాజ్యాంగం గురించి విద్యార్థులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు అనురాధ, రేఖ, విద్యా వాలంటారీలు రజిత, భాగ్య, అశ్విని, అమల, మాధురి, అంగన్వాడి టీచర్ స్వరూప, గ్రామపంచాయతీ కారోబార్ సోపన్, తల్లిదండ్రులు అంకం సుధాకర్, వీఆర్ఏ సిద్ధ రాములు , పాఠశాల సిబ్బంది సంజువ్, శ్యామల, లక్ష్మి, హనుమవ్వ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




