రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ మున్సిపాలిటీ ఆర్కేపీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ పాత్రికేయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వాతంత్ర్య సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ కన్వీనర్ ఈదునూరి సారంగారావు 74 గణతంత్ర
దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలియజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడు సంవత్సరాల కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రచించబడిన రాజ్యాంగం పార్లమెంటులో ఆమోదం పొంది 1950 సంవత్సరం జనవరి 26న అమలులోకి వచ్చిందని వివరించారు. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. రామకృష్ణాపూర్ పాత్రికేయులు ఐక్యత చాటుకుంటూ ప్రజా సమస్యలను ఆవిష్కరించే విధంగా వార్తలు రాస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాత్రికేయులందరూ ఐక్యంగా ఉంటూ ప్రజలకు-ప్రభుత్వానికి వారధి గా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కలువల శంకర్, ఆరెండ స్వామి, కనుకుంట్ల సుభాష్, పిలుమల్ల గట్టయ్య, ఆరెల్లి గోపికృష్ణ , గంగారపు గౌతమ్, మారపల్లి వేణుగోపాల్ రెడ్డి, నాంపల్లి గట్టయ్య, ఎలకటూరి నరేష్ ,పరికిపండ్ల భరత్, శ్రీనాథ్, అమర్ నాథ్ రెడ్డి, వెంకటేష్, రఘు, ప్రవీణ్, డాక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.




