:
శామీర్ పేట్, జనం సాక్షి : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నా సంకల్పంతో రోషిని స్కిల్స్ ట్రైనింగ్ సంస్థ కృషి చెయ్యడం అభినందనీయమని శామీర్ పేట్ సర్పంచ్ బాలమణి సుదర్శన్ అన్నారు. శామీర్ పేట్ లోని రోషణి స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రాగ్లాండ్, డి ఆర్ రూబెల్లా ఆధ్వర్యంలో టైలరింగ్ మరియు కంప్యూటర్ లల్లో శిక్షణ పొందిన 62 విద్యార్థులకు ముఖ్య అతిధిగా విచ్చేసినసుదర్శన్ హెచ్ఎస్ బిఆర్ హెచ్ ఆర్ డైరెక్టర్ మణికుమార్ లను పూల బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు.శిక్షణ పొందిన విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్ లు అందజేశారు. అపోల్లో హాస్పిటల్ డాక్టర్ ఆశిష్ చౌహన్ స్నాతకోత్సవంలో పాల్గొని అభినందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళలు స్వయం కృషితో ఎదగడా నికే రోషణి ఇన్స్టిట్యూట్ అహర్నిశలు పాటుపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ట్రై బ్లేజర్స్ మరియు అమన్ ఎన్ జి ఓ సహకారంతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రోషిని స్కిల్స్ ట్రైనింగ్ సంస్థ డైరెక్టర్ రాగ్లాండ్ మరియు డి ఆర్ రూబెల్లా, సూపర్ వైజర్లు రజినీకాంత్, విజయ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -1: పట్టాపొందిన విద్యార్థులతో రాగ్లాండ్, రూబెల్లా




