హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని విస్పర్‌వ్యాలీ దగ్గర ఖాళీ స్థలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని హత్య చేసి అక్కడ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.




