Tuesday, 3 November 2026

రాయికొడ్. మండల కేంద్రము లో ప్రాధమిక పాఠశాల లో విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం

రాయికొడ్ జనం సాక్షి ఫిబ్రవరి 25 రాయికొడ్. మండల కేంద్రము లోని ప్రాధమిక పాఠశాల లో విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రధనోపాధ్యాయులు డి. విఠల్ తెలిపారు. శనివారం ఉదయం 9గంటల నుంచి 5 వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి చిన్న తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థులకు బోధించడం చాలా సంతృప్తి గా ఉందని వారు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీర మనోహర్, చైర్మన్ గా శివకుమార్ వ్యవహరించారు. తెలుగు ఉపాద్యాయులు గా భాగ్యలక్ష్మి,అశ్విని, వెంకట్ లక్ష్మీ, భారత్, ఇంగ్లీష్ ఉపాద్యాయులు అమన్, మనీషా, పూజ, నభియ, గణితం ఉపాధ్యాయులుగా నందిని, హారిక, ప్రవలిక, గణేష్, సైన్స్ ఉపాధ్యాయులుగా శ్రావణి, మల్లికార్జున్,రిహన్, శివశంకర్, జిల్లా కలెక్టర్ గా రేహన్, ఏం ఇ ఓ గా వంశీ, డి ఇ ఓ గా యదేష్ వ్యవహరించారు.కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గోపాల్, ఉపాద్యాయులు సుధాకర్, శివకుమార్, శ్రావణి, తులసి, సుధ, శేఖర్, సిబ్బంది అంజమ్మ, విద్యార్థుల తల్లదండ్రులు తదితరులు పాల్గొన్నారు