Wednesday, 4 November 2026

రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అయ్యింది

 

 

 

 

 

రాష్ట్రంలో నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోంది..ఎన్నికల హామీలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం..మురళి యాదవజనం సాక్షి/ కొల్చారం
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మాత్రమే అభివృద్ధి చెందుతున్నారని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బిజెపి నేత మురళీధర్ యాదవ్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు దయాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు మాత్రమే పరిమితమైందని, నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, దళిత బంధు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేసిందని తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలో 600 మందికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చామని చెబుతున్న వారికి నేటికీ హద్దులు చూపలేదని వారికి రైతు బంధు పథకం అమలు కావడంలేదని ఆయన అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ మిషన్ భగీరథ నీరు రావడంలేదని రోడ్లు అధ్వానంగా మారాయని మురళి యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు జంగం గారి శ్రీకాంత్ గౌడ్,