సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్
హైదరాబాద్: విద్యుత్ సమస్యలకు నిరసనగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద వామపక్ష ఎమ్మెల్యేలు కళ్లకు నల్లగుడ్డ కట్టుకొని ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదనిపిస్తోందని విమర్శించారు. విద్యుత్ సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం శాసనసభను వాయిదా వేయిస్తోందని సీపీఎం జూలకంటి రంగారెడ్డి అన్నారు. విద్యుత్ సమస్యలపై సభలో ప్రభుత్వం హామి ఇచ్చేంతవరకు వెనక్కి తగ్గేదిలేదని హెచ్చరించారు.




