Wednesday, 4 November 2026

రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపనే బిఎస్పి లక్ష్యం బీఎస్పీ జిల్లా నాయకులు రాంబాబు

 

 

 

 

 

 

అలంపూర్ మే 9 జనం సాక్షి రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపనే తమ లక్ష్యమని బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకుల రాంబాబు అన్నారు. మంగళవారం మానోపాడు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కరెంటు రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధినేత్రి మాయావతి చిత్రపటానికి పుష్పాభిషేకం కార్యక్రమానికి హజరై మాయావతి చిత్ర పటాన్నికి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, ఆదివారం హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ భరోసా సభకు బెహన్ జి మాయావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారని, సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బెహన్ జి మాయావతి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు, మంగళవారం ఆమె చిత్రపటానికి పుష్పాభిషేకం చేయడం జరిగిందన్నారు. నడిగడ్డలో పుట్టిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బహుజన సమాజ్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ పుష్పాభిషేకం చేశామన్నారు. నడిగడ్డలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండడం జిల్లాకే గర్వకారణం అన్నారు. ఆర్ఎస్పీ ని ముఖ్యమంత్రి అభ్యర్థి కానుకగా ఇచ్చిన మాయావతి కి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత బహుజన సమాజ పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్ సీనియర్ నాయకులు రాజు ,ఆకేపొగు బీసన్న ,కార్యకర్తలు జయరాములు,బాబు,భాస్కర్,శ్యామ్ బాబు,మదు బాబు,ఆశొక్,మహేశ్ మరియు ఇతరూలు ఉన్నారు