మునిపల్లి, మే 09, జనంసాక్షి: మండలంలోని బుదేరా కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్‌గా హోర్చామ్ కొంఘార్ (చామ్) మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఇప్పటి వరకు బ్యాంకు మేనేజర్‌గా పని చేసిన కల్పన గుమ్మడిదల మండలం బొంతపల్లికి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో పంజాబ్ రాష్ర్టంలోని కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్‌గా పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చామ్కు బ్యాంకు సిబ్బంది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.




