హైదరాబాద్,(జనంసాక్షి): ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో బెల్ట్‌షాపుల లేవని మంత్రి పార్ధసారధి తెలిపారు. నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రి మీట్లాడుతూ మద్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్రంలో ఎక్కడైన బెల్ట్‌షాపులు ఉంటే వాటిపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరినట్లు మంత్రి వివరించారు.




