Wednesday, 4 November 2026

‘సరదాగా అమ్మాయితో’ డబుల్‌ ప్లాటినం డిస్క్‌

హైదరాబాద్‌: వరుణ్‌ సందేశ్‌, నిషా అగర్వాల్‌ జంటగా నటించిన ‘సరదాగా అమ్మాయితో’ చిత్రం డబుల్‌ ప్లాటినం డిస్క్‌ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీకుమారస్వామి ప్రొడక్షన్స్‌పై భానుశంకర్‌ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిందని చిత్ర వర్గం పేర్కొంది. ఈ సందర్భంగా డబుల్‌ ప్లాటినం డిస్క్‌ వేడుకను నిర్వహించినట్లు తెలిపింది. రవివర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచిందన్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్‌ కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *