హైదరాబాద్ : నూతన ఎక్సైజ్ పాలసీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారధి వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒకట్రెండు రోజుల్లో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ. 10 వేల కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది రూ. 12 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు ఆయన వివరించారు.




