-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్
హైదరాబాద్, మార్చి 25: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రాష్ట్రం పై ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 30 శాఖలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ హెడ్జ్ తెలిపారు. హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటు చేసిన 150వ శాఖను ఆయన నేడు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,267 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2,500కి పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అడ్వాన్స్ రూపంలో రూ.15,715 కోట్లు, డిపాజిట్లు రూ.15,700 కోట్లస్థాయిలో ఉన్నాయన్నారు.