Wednesday, 4 November 2026

రాష్ట్రపతి మీడియా కార్యదర్శిగా రాజమోని

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ణ్రబ్‌ ముఖర్జీ నూతన మీడియా కార్యదర్శిగా వేణు రాజమోని బాధ్యతలు చేపట్టినట్లు రాష్ట్రపతి భవనం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఆ పదవికి పనిచేసిన అర్చనా దత్తా సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు బదిలీ అయ్యారు. 1986 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజమోని అక్టోబరు 2010 నుంచి ఇప్పటి వరకూ ఆర్ధిక శాఖలోని ఆర్ధికి వ్వవహారాల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. యశ్వంత్‌ సిన్హా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు విదేశంగా మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సంచాలకుడిగానూ రాజమోని సెవలందించారు. మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్‌ హయాంలో ఈ పదవిని నితిన్‌ వాకన్‌కర్‌ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *