Thursday, 5 November 2026

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలో తృతీయ స్థానంలో బైంసా విద్యార్థి…

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలో తృతీయ స్థానంలో బైంసా విద్యార్థి…

భైంసా రూరల్ డిసెంబర్ 06 జనం సాక్షి

తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలు మంగళవారం నిర్వహించగా, భైంసా పట్టణానికిచెందిన శ్రీ గౌతమి పాఠశాల విద్యార్థి నాలుగవ తరగతి చదువుతున్న అక్షిత్ పరుగుపందెంలోతృతీయస్థానంలో నిలిచాడు.మొన్న జరిగిన జిల్లాస్థాయి పరుగు పందెం పోటీలలో మొదటి స్థానంలో నిలవగా, ప్రస్తుతం తృతీయ స్థాయిలో నిలవడంతో పాఠశాల యజమానులను విద్యార్థి తల్లిదండ్రులుహర్షంవ్యక్తంచేశారు.