Tuesday, 3 November 2026

రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వ పథకాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా టిఆర్ఎస్ కి ఉంది

రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వ పథకాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా టిఆర్ఎస్ కి ఉంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అలంపూర్ జనం సాక్షి (జనవరి 2) రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని, మహా శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కుటుంబం సామేతంగా దర్శించుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ కు అలంపూర్ చౌరస్తా నందు అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం, బి ఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సత్యవతి రాథోడ్ కు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి పురేందర్ కుమార్, ప్రధాన అర్చకులు ఆనంద శర్మ పూర్ణకుంభంతో స్వాతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం శాలువా పూలమాలతో సత్కరించి, ఆలయ విశిష్టతను వివరిస్తూ తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడుతూ
ఐదవశక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ఆనందంగా జీవించాలని అమ్మవారిని కోరుకున్నాను అన్నారు.
తెలంగాణ సాధించుకున్న అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అవిస్తరించేలా, టిఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు పెరగాలని అమ్మవారికి కోరుకున్నాను అని ఆమె అన్నారు.
కేంద్ర బిజెపి పాలనలో పెట్టుబడుదారులు పైపైకి పోతుంటే పేదల జీవితాలు మాత్రం మరింత దిగజారుతున్నాయి.
బిజెపి పాలనలో దేశంలో మునుపెన్నడూ లేనంతగా అనేక సమస్యలు నెలకొన్నాయి, తినడానికి తిండి లేక ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతుంటే, నరేంద్ర మోడీ పాలన బాగుంది అంటూ, బిజెపి నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారు అన్నారు ఆమె.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిది ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది, అలాగే
రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్, క‌ళ్యాణ ల‌క్ష్మీ, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి అనేక ప‌థ‌కాల‌ను ఈ రాష్ట్రంలోనే అద్భుతంగా అమలవుతున్నయి అన్నారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతాంగానికి ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా వంటివి అమలవుతున్నాయా అని ప్రశ్నిస్తున్నా అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు.. ఇలాంటి నాయకుడు దేశ్‌ కీ నేత కావాలని పేదలు కోరుకుంటున్నారు.
దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా అడుగులు వేసిన కెసిఆర్ వెంట మనమంతా ఉండాలి కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రతికార్యం దైవ సంకల్పంతో విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నాను అన్నారు.
దేశవ్యాప్తంగా వనరులు ఉన్న వినియోగించుకోలేని పరిస్థితిలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉండడం ఈ దేశ ప్రజలు చేసుకున్న దురదృష్టం అన్నారు
దేశంలో నదుల ద్వారా లక్షల టిఎంసిల నీరు ప్రవహిస్తున్న వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోవడంతో కోట్లాది ఎకరాలు ఎడారిగా మిగిలి పోయాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం, మున్సిపల్ చైర్మన్ మనోరమా,జెడ్పిటిసి రాజు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డి డబ్ల్యూ ఓ ముసాయిదా బేగం, బీఆర్ఎస్ నాయకులు అజయ్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.