మేఘన సీడ్స్ వారి కె-2222తో అధిక దిగుబడులు
-మేఘన సీడ్స్ వారి కె-2222 చైర్మన్ కోడి హరినాథ్ బాబు
-కె 2222 సీడ్ పై రైతు క్షేత్ర ప్రదర్శన
జనవరి 1:జనం సాక్షి న్యూస్:
మేఘన సీడ్స్ వారి కె-2222
అనే మిరప సీడ్స్ తో అధిక దిగుబడులు పొందవచ్చని మేఘన సీడ్స్ వారి హైదరాబాద్ కంపెనీ చైర్మన్ కోడి హరినాథ్ బాబు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారు హున్య తండా గ్రామ పరిధిలోని రాముతండా కు చెందిన రైతు బానోత్ పర్తి వ్యవసాయ భూమిలో 300లకు పైగా రైతులకు రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సైతం నల్లి,గుబ్బ,ముడుత, తెగులను తట్టుకుని అధిక రోగ నిరోధక శక్తిని కలిగి కాయ మంచి రంగుని, పొడవును కలిగి అధిక దిగుబడిని అందించేందుకు హైబ్రిడ్ మిరపలో సరికొత్త శకానికి నంది పలికిన మేఘన సీడ్స్ హైదరాబాద్ వారి కె 2222 యఫ్1 హైబ్రిడ్ మిరప సీడ్స్ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చైర్మన్ కోడి హరినాథ్ బాబు పంటను చూపిస్తూ ఆయన వివరించారు. మంచి వితనాలతోనే మంచి దిగుబడి వస్తుందని దేశానికి రాజైన రైతు ఆర్ధికంగా బలపడాలని కోరారు. పంట సాగుపై రైతులకు మిరప సాగుపై తీసుకోవాల్సిన మెళుకువలను వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్స్ చందు,రామకృష్ణ, డీలర్ షిప్ శ్రీ వెంకట సాయి పెస్టిసైడ్ అండ్ పార్టిలైజర్ గొల్లచర్ల ఎక్స్ రోడ్ బానోత్ బుచ్య, వెంగళరావు, వివిధ గ్రామాల రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




