హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి సమాజం అండగా ఉండాలి. మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి వారి భద్రత, స్వేచ్ఛకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఆడపిల్లల చదువు, వారి భవిష్యత్ పట్ల తల్లిదండ్రులు మరింత బాధ్యతగా ఉండాలి. మహిళా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు.





