Tuesday, 3 November 2026

‘ప్రత్యేక హోదాపై అనవసర రాద్ధాంతం’

'ప్రత్యేక హోదాపై అనవసర రాద్ధాంతం'
 నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరోపించారు. శనివారం నెల్లూరులో ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర రాజధానికి రూ. 1000 కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. రాజధాని ప్రణాళిక అందిన తర్వాత మరిన్ని నిధులు ఇస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *