చేర్యాల (జనంసాక్షి) మే 31 : చేర్యాల పట్టణానికి చెందిన అంబటి అంజయ్య గౌడ్ 2001 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పదవికి రాజీనామా చేసి వలస పాలనలో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా 2001 సంవత్సరంలో ఏప్రిల్ 27 టీఆర్ఎస్ ఆవిర్భావం రోజున కేసీఆర్ ను కలిసి సహచరులతో కలిసి పార్టీలో చేరి చేర్యాల పాత నియోజకవర్గానికి టీఆర్ఎస్ జెండా తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. ఉద్యమ టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేంత వరకూ పని చేస్తూ టీఆర్ఎస్ మండల సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా తన శక్తిని మించి అహర్నిశలు 2014 వరకు పోరాటాన్ని ఉదృతం చేశారు. కాలుకు గజ్జ కట్టి గ్రామ గ్రామాన ఆటపాటలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రజలను మరింత చైతన్యం పరిచారు. తెరాస పార్టీ నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్, బంద్ లు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు, బహిరంగ సభలకు పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమములో ముందుండి తనవంతు పాత్రను నిర్వహించి పోరాటాన్ని కొనసాగించిన ఉద్యమకారుడు అంజయ్య. తెలంగాణా ఉద్యమ సమయంలో చేర్యాల పట్టణంలో 2009 సంవత్సరంలో ఆమరణ దీక్షా చేస్తున్న కేసిఆర్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీ.యస్.ఎన్.ఎల్ టవర్ ఎక్కి ఆనాటి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మాహుతిని తట్టుకోలేని అంబటి కపోద్రిక్తుడై చేర్యాల పాత బస్సు స్టాండ్ వద్ద జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును జై తెలంగాణ అంటూ తెలంగాణా రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని నినాదాలు చేస్తూ బస్సు అద్దాలు పగులగొట్టాడు. ఆఘటనలతో పోలీసులు అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి చిత్ర హింసలు, లాఠీ దెబ్బలు తిని పలుమార్లు జైలు జీవితం గడిపారు. అంతటితో తగ్గకుండా రాష్ట్రం సిద్ధించే వరకు పార్టీ, జేఏసీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంతే కాకుండా తాను స్వయంగా స్థాపించిన మానవత యువజన సంక్షేమ సంఘం అధ్వర్యంలో విద్యార్థులకు తెలంగాణ పాటలు, దేశభక్తి గీతాలు,ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థులకు అనేక బహుమతులు అందజేశారు. 2009-10 తెలంగాణ రాష్ట్రం సిద్దించాలని బచన్నపేట మండలం (సిద్దులగుట్ట) కొడువటూర్ పుణ్యక్షేత్రం నుండి సైకిల్ యాత్ర తన సంఘం సభ్యులతో ప్రారంభించి బచన్నపేట, ఆలింపూర్, బసిరెడ్డిపల్లి, సలాక్ పూర్, పలు గ్రామాలు తిరుగుతూ.. మద్దూరు మడల కేంద్రం చేరుకొని తెలంగాణ దీక్షాస్థలిలో దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం రాత్రి వరకు బెక్కల్ రామలింగేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం తెలంగాణ ఉద్యమ కరపత్రాలు పంచుతూ.. జై తెలంగాణ జై జై తెలంగాణ నినాదాలు చేస్తూ వీర భైరాన్ పల్లికి చేరుకొని 1969 తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. అటు నుండి పలు గ్రామాల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ.. వల్లంపట్ల, గాగిల్లపుర్, నర్సాయపల్లి నుండి చేర్యాలకు చేరుకుని తెలంగాణ దీక్షాస్థలిలో దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి మళ్లీ ఇటు నుండి పలు గ్రామాలు తిరిగి కొమురవెల్లి పుణ్య క్షేత్రం చేరుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త్వరగా కావాలని ముడుపులు కట్టి సైకిల్ యాత్ర ముగించారు. 2011లో “పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని” రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ “మానవత యువ జన సంక్షేమ సంఘం అధ్వర్యంలో కళా కారులతో వేములవాడ నుండి యాదగిరగుట్ట వరకు తెలంగాణ జన చైతన్య రథ యాత్ర తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకథను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచుతూ పలు మండలాల్లో దీక్షా స్థలిలో ఉద్యమకారులకు సంఘీభావం తెలిపుచూ యాదగిరగుట్టకు చేరుకుంది. యాత్ర యాదాద్రిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏలాంటి అవరోధాలు రాకుండా కావాలని ముడుపులు కట్టి ముగించారు. మానవత యువజన సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అంబటి అంజయ్య సంస్థ అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ వచ్చిన వారికి నగదు పారితోషికం, ప్రోస్తాహక బహుమతులు దాతల సహకారంతో అందజేశారు. వ్యాధులపై అవగాహన సదస్సు, ఉచిత మెగా వైద్య శిభిరం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మానవతకు 2010లో కేంద్ర యువ జన క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డు హన్మకొండలో ఉత్తమ సేవ సంస్థ అని 5వేల నగదు అందించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు సవత్సరం పూర్తి ఐన సంధర్భంగా మండల తెలంగాణ “ఉత్తమ సమాజ సేవకుడు”గా రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10వేల నగదుతో పాటు శాలువాతో మేమంటో ఇచ్చి సత్కరించారు. కానీ నేటి వరకు ఉద్యమ కారుడిగా కానీ, కళాకారుడిగా సాంస్కృతిక సారథిలో ఉద్యొగం , రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి బ్యాంక్ ఋణ సహాయం కాని, ఉపాధి కల్పించక పోవటం బాధాకరం. తమకు తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో కలాకారుడి ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ లకు అధికార టీఆర్ఎస్ పార్టీ చేర్యాల ఎంపీపీ శ్రీధర్ లెటర్ ప్యాడ్ తో ప్రతిపాదనలు పెట్టి రిజిస్టర్ పోస్టులు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరుగలేదని వాపోయారు. ఇప్పటికైనా సీఎం కెసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్ లు స్పందించి తమను ఆదుకోవాలని అంబటి అంజయ్య వేడుకుంటున్నాడు.




