Monday, 2 November 2026

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

వరంగల్ ఈస్ట్ మే 31 (జనం సాక్షి)కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుఈరోజువరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 18వ డివిజన్ లో అయిత అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 18వ డివిజన్ బిజెపి యువ నాయకుడు మైదం తిరుపతి అతనితోపాటు అయిత క్రాంతి, అజయ్, అనిల్, రబ్బాని, గౌస్, ఇస్మాయిల్, అయిత అమర్, అయిత సామ్ సమ్, బిట్టు, కౌశిక్, నాని, చంటి, యువరాజ్, చరణ్ వీరితోపాటు100 మంది కార్యకర్తలు, అలాగే 41,42 డివిజన్ లో నారాగోని మురళి-స్వప్న ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ (యూత్ అధ్యక్షుడు) బండ్ల జయరాజ్, (వైస్ ప్రెసిడెంట్) బండ్ల ప్రవీణ్, ఎండి నవాజ్ (కార్యదర్శి,) కొత్త పవన్, చాగంటి భాస్కర్, కిరణ్ శ్రవణ్ క్రాంతి లతోపాటు మరో 100 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సమక్షంలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నల్గొండ రమేష్, మడిపల్లి కృష్ణ, మీసాల ప్రకాష్, చిప్ప వెంకటేశ్వర్లు, రేణుగుంట్ల శివ పుష్ప, సునిత, సయ్యద్ వస్సిం మోయిన్, తదితరులు కొండా అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు….