Monday, 2 November 2026

రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్ర పై టిఆర్ఎస్ పార్టీ కి మాట్లాడే నైతిక హక్కు లేదు.. మాజీ పిసిసి

రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్ర పై టిఆర్ఎస్ పార్టీ కి మాట్లాడే నైతిక హక్కు లేదు.. మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్….

జనగామ (జనం సాక్షి )అక్టోబర్30:జనగామ జిల్లా కేంద్రంలో పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు. స్వాతంత్ర్యం పోరాటంతో బీజేపీ ఎక్కడుంది. వారు పోరాడారా, మూడు రంగుల జెండా పట్టుకొని తిరిగారా.రాహుల్ గాంధీ ప్రజలకోసం చేసే యాత్ర పై మాట్లాడే అర్హత ఎవరికీ లేదు..
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ ది..కెసిఆర్ తెలంగాణలో దోచుకున్నది చాలాకనే జాతీయ రాజకీయాలకు.ఫాం హౌజ్లో ఉండి రాజకీయం చేసే వాల్లు దేశరాజకీయాలు చేస్తారా.
ప్రజలు అవసరమైనప్పుడు సరైన సమాదానం చెప్తారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగుతుంది.ఈ శతాబ్దంలో రాహుల్ పాదయాత్ర చారిత్రాత్మకం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మూడవ ఘట్టం.మహాత్మా గాంధీ దండి పాదయాత్ర ,ఉప్పుసత్యా గ్రహం ,స్వాతంత్ర పోరాటానికి ఊపునిచ్చింది ఈ యాత్ర.. స్వాతంత్ర్యం రాకముందుకు దేశం సంపన్న దేశం ఇప్పుడు ఎవరెవరో పాలిస్తూ దిగజార్చారు.విభజించాలి పాలించాలి పరిపాలనలోకి రావాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం.తెలంగాణలో భారత్ జోడో యాత్రను జయప్రదం చేయాలి అని తెలిపారు.ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్ పల్లి లింగాజీ జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జనగామ జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్ నర్సియ్య పంతులు
ఓబీసీ సెల్ జనగామ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్ జనగామ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేమళ్ల రాజనర్సింహ రెడ్డి జనగామ మండల అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి చేర్యాల మండలాధ్యక్షులు ఆది శ్రీనివాస్ తరిగొప్పుల మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ నర్మెట్ట మండల అధ్యక్షులు జంగిటి అంజయ్య బచ్చన్నపేట మండలాధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి జనగామ మండల అధ్యక్షులు సేవాదళ్ రాష్ట్ర ఆర్గనైజర్ సుంకర శ్రీనివాస్ రెడ్డి కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నిడికొండ శ్రీనివాస్
జనగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కల్యాణి వడ్లకొండ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎన్ ఎస్ ఐ అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్ జనగామ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యండి మాజిద్ జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతిష్ జనగామ జిల్లా నాయకులు బడికె కృష్ణస్వామి కాముని శ్రీనివాస్ రంగు రవి పంపర మల్లేశ్ జనగామ జిల్లా సేవదల్ అధ్యక్షుడు పారుపెళ్లి ప్రభాకర్ రెడ్డి మరిగడి ఎంపీటీసీ సలేంద్ర శ్రీనివాస్ జనగామ పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షుడు మోటే శ్రీనివాస్ జనగామ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు యట క్రాంతి
తదితరులు పాల్గొన్నారు