నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం.
– నెన్నెల ఎస్సై రాజశేఖర్.
బెల్లంపల్లి, అక్టోబర్ 30, (జనంసాక్షి)
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల ఎస్సై రాజశేఖర్ అన్నారు. ఆదివారం నెన్నెల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి షాపు, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమార్చుకోవాలన్నారు. మండల కేంద్రం లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరూ సహకరించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత దగ్గరై సేవలు చేయడానికి సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడానికి మరియు అమాయకులను విద్రోహ శక్తుల నుండి రక్షించడానికి సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయని వివరించారు. సీసీ కెమెరాల పుటేజ్ వల్ల కోర్టులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని అవగాహన కల్పించారు. సున్నితమైన ప్రాంతాల్లో సిసి కెమరాల నిఘా ఎంతో కీలక ప్రాత వహిస్తాయని, వ్యక్తుల కదలికలను పరిశీలించడానికి, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
సీసీ కెమెరాలు 24 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ పనిచేస్తాయన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయంతోనే నేరాలు నియంత్రణ సాధ్యపడుతుందని వివరించారు. ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా మరింత భద్రత కల్పించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని 24 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు అమర్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. తాను సైతం తన వంతుగా సీసీ కెమెరాల కోసం విరాళం అందిస్తానని తన వంతుగా ₹ 5 వేలు ప్రకటించారు. కమ్యూనిటీ సి సి కెమెరాల కార్యక్రమం లో ప్రజలను, ప్రజా ప్రతినిధులను, ఇతర వ్యాపారస్తులను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మండలంలోని మిగిలిన అన్ని గ్రామాల్లో త్వరలోనే సీసీ కెమెరాలు గ్రామస్తుల సహకారం తో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నెన్నెల మండల కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చేందుకు ముందుకు వచ్చిన స్థానిక వ్యాపారులను ఎస్ ఐ అభినందించారు. నెన్నెల మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, రిపేర్ చేయడానికి మరియు కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు మరియు ప్రముఖులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు, ట్రాక్టర్ యజమానులు, కిరణం షాపు యజమానులు, గ్రామ పెద్దలు, పురప్రముఖులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం.




