లేకుండా చేయాలన్నదే బిజెపి కుట్ర – ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీకి మద్దతు ముందుకు రావాలి… మతతత్వ బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి – ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మంథని ఎమ్మెల్యే శ్రీదర్ బాబు జనంసాక్షి, మంథని : రాహుల్ గాంధీ పై వేటు.. ప్రజాస్వామ్యానికి చేటు..! అని, దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలన్నదే బిజెపి కుట్ర పన్నిందని ఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీకి మద్దతు తెలిపి, మతతత్వ బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ నిరసన దీక్ష కాంగ్రెస్ శ్రేణులు చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ నిరసన దీక్షకు మంథని కోర్టు బార్ అసోసియేషన్, భారత కమ్యూనిస్టు పార్టీ( మార్కిస్టు) నాయకులు సంఘీభావం తెలిపి నిరసన దీక్షలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పై వేటు వేయడం దుర్మార్గమైన చర్య, అనర్హత అప్రజాస్వామికం అని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మోదీ ఈ దుశ్చర్య పాల్పడ్డారని ఆరోపించారు. బిజెపి అధికారం కోసం దేశాన్ని కులాల పేరిట, మతాల పేరిట చీల్చాలని ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు ఎండనక వాననక భారత జోడో యాత్ర చేపట్టారని అన్నారు. రాహుల్ గాంధీ అదాని ఆస్తులపై జేపీసీ డిమాండ్ చేసినందుకే అదాని ని కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ఆదానిలకు ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెడుతున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఎక్కడైతే నిరవ్ మోడీ, లలిత్ మోడీ ల మీద వ్యాఖ్యలు చేశారో అదే కొల్లార్ పట్టణంలో భారీ ర్యాలీని ఏర్పాటు చేస్తామనీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. అంబానీ, అదానీలకు దేశ సంపద కట్టబెట్టినందుకు ప్రశ్నిస్తే అనర్హత వేటు వేస్తారా..?అని ప్రశ్నించారు. దేశ ప్రజలు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముక్త కంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని శ్రీధర్ బాబు అన్నారు.
రాహుల్ గాంధీ పై వేటు.. ప్రజాస్వామ్యానికి చేటు..! – దేశంలో కాంగ్రెస్ పార్టీ




