Tuesday, 3 November 2026

సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి

సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి
మల్దకల్ ఎస్సై ఆర్ శేఖర్మల్దకల్ మార్చి 29 (జనంసాక్షి) సైబర్‌ నేరాలలో విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలనిమల్దకల్ ఎస్ఐ ఆర్.శేఖర్అన్నారు.బుధవారం కమ్యూనిటి పోలీసులో భాగాంగా మల్దకల్ ఎస్ఐ ఆర్. శేఖర్ ఆధ్వర్యంలో మండల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆర్. శేఖర్ మాట్లాడుతూవచ్చేనెల నుండి జరిగే పదవ తరగతి పరీక్షలు విద్యార్థినులు చక్కగా చదివి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు.ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్‌లు కీలకంగా మారాయని,ఫోన్‌లలో కొంత మంది అపరిచిత వ్యక్తులు బ్యాంకు ఖాతా,ఏటీఏం వివరాలు అడుగుతారని, ఎవరూ తమ ఖాతా వివరాలు చెప్పరాదన్నారు. స్మార్టు ఫోన్‌ తెలివిగా ఉపయోగిస్తే క్షణాల్లో ఏ సమాచారమైనా అరచేతిలో ఉంటుందని,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంత వేగంగా కష్టాల్లో పడతారని అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.2006లో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొచ్చిందన్నారు.బాలలను బడికి మాన్పించి చేనులో కాని, ఎక్కడైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో,ఉపాధ్యాయులు విద్యార్థులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.