Tuesday, 3 November 2026

రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ నాయకుల సత్యాగ్రహ దీక్ష.

రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ నాయకుల సత్యాగ్రహ దీక్షమల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి28.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేసిన హాత్ సే హాత్ జొడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టి వారు చెప్పిన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తారని భయంతోనే అనర్హత వేటు వేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ అన్నారు. రాహుల్ గాంధీకి పార్లమెంటులో అనర్హత వేటు వేసినందుకు మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఈసందర్భంగా నంది కంటి మాట్లాడుతూ.ప్రతిపక్ష నేతల పై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రం నుండి 28 మంది 10 లక్షల కోట్లు బ్యాంకుల నుండి అప్పులు చేసి ముంచే చేశారని,నోటు మార్పిడితో దేశానికి నష్టం తెచ్చారని, దేశానికి ఆదాయం తెచ్చి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నింటిపై ప్రశ్నించే గొంతు పార్లమెంటులో విన పడవద్దని రాహుల్ గాంధీ సభ్యత్వం పై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.ప్రజలు మేధావులు పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని దేశ సంపదను కొల్లగొడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని విమర్శించారు.నియంతృత్వ పాలనకు ముగింపు పలికే విధంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో  శ్రీనివాస్ గౌడ్,వెంకటేష్,జీవన్ రెడ్డి,గుత్తి రామ్ చందర్,ఉమేష్ సింగ్,సానాది శంకర్,శ్రీనివాస్ గౌడ్,సంతోష్ ముదిరాజ్, వినోద్ యాదవ్,రాములు,గౌస్ బాయ్, సియల్ యాదగిరి,వంశీ ముదిరాజ్, రెబ్బ వాసు, సంతోష్ యాదవ్,కుట్టి శ్రీను, సురేష్ యాదవ్, రోజా రమణి, కృష్ణవేణి, ప్రభ,పద్మ,యశోద,రజిని,సుధ,మాధవి తదితరులు