Tuesday, 3 November 2026

రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ నాయకుల ఆందోళన

రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ నాయకుల ఆందోళన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ములుగు ఎమ్మెల్యే సీతక్కఏటూరునాగారం,(జనం సాక్షి)మార్చి28. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై అనర్హత వెయిట్ వేయడం రాజకీయంగా తీవ్ర  దుమారానికి   దారితీసింది ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని రాహుల్ లోక్ సభ  సభ్యత్వం రద్దు పై మంగళవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట  ఏటూర్ నాగారం మంగపేట తాడ్వాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన చర్య ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమే అని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై కలసి కట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అన్నారు.రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతూ రాజ్యాంగ ప్రజల హక్కుల  కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఆయనను అనర్హుడిగా చేయడానికి భజప అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిందని బజాపా తీరుపై మండిపడ్డారు. దేశాన్ని దోచుకుంటున్న దొంగను దొంగ అని పిలవడం కూడా  నేరమైంది నియంతృత్వ పాలనకు ముగింపు పలికే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. దేశ సంపదను మింగేస్తున్న బజాప కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల  వెంకన్న. మండల అధ్యక్షులు చిటమట రఘు. జిల్లా యూత్ అధ్యక్షులు పైడాకుల అశోక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెన్నూరు బాలరాజు, పడిదెల హనుమంతు,ఎల్లయ్య, శ్రీను,కొండ గొర్ల పోశయ్య, సులేమాన్,నిగరగంటిముతేష్ తదితరులు పాల్గొన్నారు.