– ఐఐటి, నీట్ నిపుణులు మిట్టారమేష్.
– సిఓఈలో ఉన్నతవిద్యావకాశాలపై అవగాహన సదస్సు.- హాజరైన 10వ తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలవుతున్న ప్రత్యేక కార్యచరణపై అవగాన కలిగించిన నిపుణులు.
బెల్లంపల్లి, మార్చ్ 28, (జనంసాక్షి )
నాణ్యమైన ఉన్నతవిద్య కోసం ప్రభుత్వ విద్యాసంస్థలే ఉత్తమమైనవని ప్రముఖ విద్యానిపుణులు మిట్టారమేష్, బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అన్నారు. మంగళవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ) బెల్లంపల్లిలో ఉన్నత విద్యా అవకాశాలపై పేరెంట్స్ కమిటీ ఆద్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ రంగు రంగుల ప్రకటనలకు మోసపోయి ప్రభుత్వ విద్యకు దూరం కావొద్దని తల్లిదండ్రులకు వారు సూచించారు. ఐఐటి, నీట్ వంటి ఉన్నతమైన విద్యావకాశాలకోసం ప్రభుత్వ విధ్యాసంస్థలను ఉపయోగించుకొనేలా పిల్లలను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్నందున ప్రతి విద్యార్థి గురుకులాల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించి తమ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఇంటర్ మీడియట్ విద్యతోపాటు దేశంలోనే ఉన్నతమైన ఐఐటి, మెడికల్ వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా ఉత్తమమైన శిక్షణ ఇస్తున్న సంక్షేమ గురుకుల సిఓఈల్లో 10వ తరగతి చదువుతున్న పిల్లలు చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హైయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ కో ఆర్డినేటర్ అవునూరి రవి, నీట్ మరియు ఐఐటి పరీక్షల నిపుణులు మిట్టారమేష్ 10వ తరగతి తరువాత ఉండే ఉన్నత విద్యావకాశాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటి అధ్యక్షులు దాగం మహేష్, జమ్మి శ్రీనివాస్, కుమ్మరి సమ్మయ్య, రాజ్ కుమార్, తండ్ర శేఖర్, సేని వెంకన్న, డి కల్పన, లక్ష్మి, పోశమ్మ, దుగుట మల్లయ్య, పెరుగు దామోదర్, కనుకుంటల కుమార్, కామెర రమేష్, వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, కొక్కుల రాజేశ్వర్, షిండే దత్తప్రసాద్, బోదనాసిబ్బంది రామిశెట్టి రామారావు, వరమని ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతవిద్యకు ప్రభుత్వ విద్యాసంస్థలే బేష్.




