రిటైర్డ్ దేశ సైనికుడు వినయ్ కుమార్ ను సన్మానిస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తోటి మిత్రులు
వీణవంక జనవరి 2 (జనంసాక్షి ) వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల వినయ్ కుమార్ 2002వ సంవత్సరంలో భారత సైనికునిగా ఉద్యోగంలో చేరి భారత సైనికునిగా రిటైర్డ్ అయి ఈరోజు తన పుట్టిన గ్రామంలో ఉద్యోగ రిటైర్డ్ అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సన్మాన కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఇంటికి పెద్దకొడుకైన పోతుల వినయ్ కుమార్ ను వారి తల్లిదండ్రులు భారతదేశ సేవకు పంపడం నిజంగా అభినందించవలసిన విషయమని వారన్నారు రక్తం గడ్డ కట్టే చలిలో కూడా దేశ శత్రువులతో పోరాడటానికి భారత సైనికులు చేస్తున్న విధి నిర్వహణ ఎంతో గొప్పదని తెలిపారు రాజస్థాన్ లో మొదలైన సైనిక బాధ్యతలు జమ్ము కాశ్మీర్ వరకు సేవలు అందించి ఎంతో శ్రమ ఓర్చి మంచి దేశ సైనికునిగా మళ్లీ గ్రామానికి తిరిగి రావడం గర్వ కారణమని పేర్కొన్నారు ఎందరో యువకులు విద్యార్థులు పోతుల వినయ్ కుమార్ ను అతనిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ సేవ కొరకు యువకులు ముందుకు రావాలని కోరారు దేశ సైనికుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయినప్పటికీ దేశ సేవలో ప్రాణాలు పోడగొట్టుకున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని సైనికులను గౌరవించవలసిన బాధ్యత మనది అన్నారు వినయ్ కుమార్ దేశ సరిహద్దులలో సేవలు 20 సంవత్సరాల సేవలు అందించినట్లు సమాజంలో కూడా సేవలు అందించాలని కోరారు వినయ్ కుమార్ ను అతని కుటుంబ సభ్యులు మరియు చిన్ననాటి మిత్రులు శాలువాలతో సత్కరించారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల నరసయ్య. మాజీ సర్పంచ్ కర్ర భగవాన్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి ఆనందం రాయమల్లు. పోతిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఐలవేణి శ్రీనివాస్. వినయ్ కుమార్ చిన్ననాటి మిత్రులు క్లాస్ మెంట్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




