Tuesday, 3 November 2026

తానుర్ మండలకేంద్రం లో బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా..

తానుర్ మండలకేంద్రం లో బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా..

నిరుపేదకుటుంబాలకి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం…

భైంసా రూరల్ జనవరి 02 జనం సాక్షి

 

బీజేపీరాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో రాస్తారోకో…

ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది కుటుంబాలు సొంత ఇండ్లు లేక అద్దె ఇండ్లలో ఉంటున్నారని, పేదలను బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ మండిపడ్డారు. సోమవారం తానూర్ లో డబుల్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. తానూర్ మండల వ్యాప్తంగా డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బస్టాండ్ ప్రాంతంలో గంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మోహన్ రావు పటేల్ మాట్లాడారు.నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది కుటుంబాలు డబుల్ బెడ్ ఇండ్ల కోసం దరఖాస్తు లు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్న పంపిణీ చేయక పోవడం, కొన్ని గ్రామాల్లో అసలు ఇండ్లను నిర్మించనే లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చడంలో బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.తానూర్ మండలంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ ఇల్లు ఇవ్వకపోవడందారుణమన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావులు డబుల్ ఇండ్లు ఇస్తామని హామిచ్చిన వీడియోలను పేదలకు ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. అనంతరం డిటి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కౌన్సిలర్లు కపిల్, గాలి రవి, దిలీప్, యువ నాయకులు గోపాల్ పటేల్, లీడర్లు సుభాష్ పటేల్, శ్రీనివాస్, రామకృష్ణ, మనోజ్,జ్ఞానేశ్వర్,గణేష్,సాయినాథ్, పేద కుటుంబాలు, కార్యకర్తలు పాల్గొన్నారు