Wednesday, 4 November 2026

రిపోర్టర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

 

 

 

గుడిహత్నూర్: మార్చ్, 6 (జనం సాక్షి)మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ నాగుల సతీష్ కోన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ప్లాస్టిక్ సర్జరీ అయ్యి తిరిగి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఏఐసీసీ సభ్యులు డా నరేష్ జాదవ్ ఇంటికి వెళ్లి ఆయన ను పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులతో ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకోని ఆయనకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఆయన వెంట బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ వసంత్ రావు, ఇచ్చోడ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లందడే నాగ్ నాథ్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ గఅశోక్ తదితరులు ఉన్నారు.