జనం సాక్షి, మంథని :బెదిరింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దూరంగా ఉంటుందని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజయ్య అన్నారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా మంథనిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల రామగిరి ఎంపీపీ ఆమె భర్తకు సొంత పార్టీ నాయకుల నుండే ప్రాణహాని ఉందని వారు స్వయంగా పత్రికాముఖంగా చెప్పడం బిఆర్ఎస్ పార్టీకి సిగ్గుచేయడానికి వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి బిఆర్ఎస్ నాయకుడు శంఖేష్ రవీందర్ శ్రీధర్ బాబుపై నోటికి వచ్చినట్లు మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. బహుజనవాదాన్ని వాడుకుంటూ బహుజనులనే అనగ ద్రోక్కుతున్నారని వారు ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాకేష్ మంథని యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు పెంటరి రాజు, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు బండారి ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మంతెన సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లైసెెట్టి రాజు, గాజుల నిఖిల్, పొనగంటి నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాకేష్ మంథని యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు పెంటరి రాజు, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు బండారి ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మంతెన సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లైసెెట్టి రాజు, గాజుల నిఖిల్, పొనగంటి నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.




