Wednesday, 4 November 2026

కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి):  జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. కుటంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెనుకొండలోని హెచ్‌ఎమ్‌టీ కాలనీలో నివాసముండే చంద్రశేఖర్‌, రమాదేవి దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. రమాదేవి ఇంట్లోనే ఉంటూ డీఎస్సీకి ప్రిపేరవుతోంది. చంద్రశేఖర్‌ సోమందేపల్లి మండలం, జూలుకుంట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే వీరిమధ్య ఉన్న విభేదాలు ఇద్దరినీ బలితీసుకున్నాయి. కలహాల కారనంగా ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో చంద్రశేఖర్‌ ఉన్నపళంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. మంగళవారం ఉదయం చంద్రశేఖర్‌ మృతదేహం కొండాపురం ప్రాంతంలో రైలుపట్టాలపై కనిపించింది. ఇదిలా ఉండగా రమాదేవి ఇంట్లోనే ఉరివేసుకుంది. చుట్టుపక్కల వాళ్లకి అనుమానం వచ్చి తలుపు తట్టగా లోపల గడియపెట్టి ఉండడం గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపు తెరిచి చూడగా రమాదేవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రమాదేవిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఉన్న చంద్రశేఖర్‌ మృతదేహాన్ని రమాదేవి బంధువులు గుర్తించారు. దీంతో దంపతులిద్దరూ కుటుంబకలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పెనుకొండ సీఐ రాజేందర్‌ ధృవీకరించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. దీంతో చిన్నారి ఒంటరిదయ్యయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *