.*
రిలే నిరాహార దీక్షలో సీపిఎం జిల్లా ప్రజా సమస్యలన్నీ పరిష్కరింకార్యదర్శి జబ్బార్
పానుగల్ నవంబర్ 07జనంసాక్షి
ప్రజా సమస్యలన్నీ పరిష్కరించాలని సీపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ అన్నారు.మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గత రెండు నెలల క్రితం రేమద్దుల గ్రామం నుండి మండలం వరకు ప్రజలు చేసిన పాదయాత్రలో ప్రజల సమస్యలపై పరిష్కారానికి అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేమద్దుల గ్రామంలో నాలుగు రోజులపాటు కొనసాగే రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలల్లో భాగంగా పోడు భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు సాగు పట్టాలు ఇస్తామని ఇవ్వకపోవటం పై ప్రశ్నించారు.అదేవిధంగా లావని పట్టా భూముల సాగు రైతులకు ఇచ్చే బ్యాంకు రుణాలను ఆపివేయటం అన్యాయం అని,వెంటనే రైతులందరికీ రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి రైతుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. అదేవిధంగా ఖాళీ ఇండ్ల స్థలాలు ఉన్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున ఇస్తామని ఇవ్వకపోవడం దారుణంగా ఉందన్నారు. ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరత కలిగిన వాళ్ళందరికీ పెన్షన్లు,రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు.నిరాహార దీక్షలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు గంధం భగత్,చంద్రశేఖర్ జి.మల్లేష్ బాలకృష్ణయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వెంకటయ్య, సిపిఎం పానుగల్ మండల కార్యదర్శి దేవేందర్,సిఐటియు మండల నాయకులు జి.వెంకటయ్య రైతు సంఘం గ్రామ నాయకులు బాల్ రెడ్డి నిరంజన్ డివైఎఫ్ఐ గ్రామ నాయకులు భాస్కర్ గౌడ్ ఎండి ఖాజా ఎస్ఎఫ్ఐ కుమార్, తదితరులు పాల్గొన్నారు.




