ఎంపిపి ప్రతాప్ రెడ్డి
జుక్కల్, మార్చి 26, (జనంసాక్షి),
రుణాలు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి పాటుపడాలని పెద్ద కొడప్ గల్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి రైతులను కోరారు.ఆయన ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పెద్ద కొడప్ గల్ సింగిల్ విండో మహాజన సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.వన్ టైం సెటిల్ మెంట్ కు అర్హత ఉన్న రైతులు ఈ నెలాఖరులోగా రుణాలు చెల్లించాలని ఆయన కోరారు.వన్ టైం సెటిల్మెంట్ గడువు ఈనెలాఖరు వరకు మాత్రమే ఉందని అన్నారు.ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.సొసైటి సిఈఓ సందీప్ కుమార్ ఆదాయ వ్యయాలు చదివి వినిపించారు.ఈ మహాజన సభ సొసైటి చైర్మన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా సభలో సింగిల్ విండో ఉపాధ్యక్షులు ఆర్ .సంగారెడ్డి,డైరెక్టర్ లు, సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు,సింగిల్ విండో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రుణాలు సకాలంలో చెల్లించండి




