Monday, 2 November 2026

రుద్రుర్ నివాసి యo విశ్వనాథ్ కు డాక్టరేట్

రుద్రుర్ (జనంసాక్షి):రుద్రూర్ స్వాధ్యాయ విద్యాపీట్ విద్యార్థి యo విశ్వనాథ్ కు గౌరవ డాక్టరేట్ లభించింది
ఇండియాలో ఉన్న ప్రముఖ  విశ్వవిద్యాలయాలలో  ఒకటి అయినటువంటి   ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ” విద్యలో అద్వైత వేదాంత తత్వ జ్ఞానం యొక్క ఆవశ్యకతo” గురించి చేసిన పరిశోధనకు గాను   ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల  డీన్   ప్రొఫెసర్ టీ కృష్ణారావు నిరంతర పర్యవేక్షణలో గౌరవ డాక్టరేట్  యo. విశ్వనాథం రుద్రూర్  ప్రధానం చేయడం జరిగింది .ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ  నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తిని మరియు ఉన్నత  విద్య కొరకు ఆలోచించడం జరుగుతుంది కానీ పిల్లలకు  సంస్కారం మరియు విలువలతో కూడిన విద్యను  అందించాలని  దీనితో పాటు   ప్రతి విద్యార్థి ఉన్నత ఆలోచనలు కలిగి సాధారణ జీవనం జీవించడంతో పాటు ””విద్య వినయేన శోభతే ”  విద్య ద్వారా వినయ విధేయతలు , అహంకార రహితమైన జీవితం, నిస్వార్థ సేవ  ప్రతి వ్యక్తిలో  రావాలని, ఈ పరిశోధనకు ప్రేరణ కలిగించిన  దాదాజీ, దిదిజి , యోగ గురు రాందేవ్ జి, ఆచార్య బాలకృష్ణ జి ,యజ్ఞ దేవ్ జి ,నిగల్ జి , తల్లితండ్రుల, గురువులు ,బంధుమిత్రులు ఎంతగానో సహకరించారని ఒక తెలియజేశారు,