Wednesday, 4 November 2026

రుద్రూర్ ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో బిస్కెట్లను పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్

 

 

 

 

 

 

 

 

రుద్రూర్ (జనంసాక్షి):రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ (గాంధీ స్కూల్) లో గురువారం నాడు 144 మంది పిల్లలకు మంచి రుచికరమైన పతంజలి బిస్కెట్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనీషా బేగం మాట్లాడుతూ మా స్కూల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు గతం లో కూడా పిల్లల కొరకు అనేక సేవ కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఇప్పుడు అందరి పిల్లలకు బిస్కెట్లను ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని క్లబ్ సభ్యులందరికి పిల్లల మరియు ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజెశారు

ఈయొక్క కార్యక్రమములో క్లబ్ అద్యక్షులు లయన్ శ్యామ్ సుందర్ పహడే,సెక్రటరీ లయన్ కె.ప్రవీణ్ కుమార్,ట్రెసరర్ లయన్ కెవి.మోహన్,వైస్ ప్రెసిడెంట్ లయన్ పత్తి రాము, సభ్యులు లయన్ లోగం నాగరాజు, లయన్ మహేష్,కొత్త సభ్యులు లయన్ పుట్టి సాగర్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు భూలక్ష్మీ, శిరీష,విజయలక్ష్మి తదితరులు పాలుగొన్నారు