Tuesday, 3 November 2026

పోడు గోడు తీర్చిన కెసిఆర్. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


నెన్నెల, జులై 6, (జనంసాక్షి )
గిరిజనుల పోడు గోడును తీర్చిన గొప్ప వ్యక్తి కెసిఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నెన్నెల మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 166 మంది లబ్ధిదారులకు 264 ఎకరాల భూమికి పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ భూమిలో పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించి వెంటనే అమలు జరిగేలా చర్యలు తీసుకున్నాడని అన్నారు. గిరి వీరుడు కొమురం భీం సాక్షిగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే పట్టాల పంపిణీ శ్రీకారం చుట్టి మరోసారి గిరిజనులపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నత్తికై పాటు పడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ను మరోసారి గెలిపించి ఋణం తీర్చుకుందామని అన్నారు. ఈకార్యక్రమానికి ముందు చిత్తాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 60 లక్షల ఐటీడీఏ నిధులతో డార్మెంటరీ హల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి, ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, వైస్ ఎంపీపీ గురునాదం సుమలత, ఎంపీటీసీలు పురంశెట్టి తిరుపతి, ఓరేం కమల, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచులు తోట సుజాత శ్రీనివాస్, గొర్లపల్లి బాపు, కంకణాల తిరుపతి రెడ్డి, రావుల సత్యనారాయణ, బత్తిని పద్మ, జనగామ శంకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడ్డం అశోక్ గౌడ్, నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.