రుద్రoగి లో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
రుద్రంగి డిసెంబర్ 28 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్స్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం ను మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి డిసిసి కార్యదర్శి
చేలుకల తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి కార్యదర్శి పార్టీ జెండా ను ఆవిష్కించి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ అని భారత దేశ స్వాతంత్రం తేవడంలో కీలక పాత్ర పోషించిందని,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. రాబోయే కాలంలో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి,పల్లి గంగాధర్,గండి నారాయణా,అభిలాష్,గంధం మనోజ్,అట్టేపెల్లి మల్లేశం,అల్లూరి గణేష్, దువ్వాక గంగాధర్,సనుగుల గంగాధర్,సామ సంతోష్,వాకిటి భూమారెడ్డి,సాయి మల్లయ్య,శ్రీనివాస్,తది తరులు పాల్గొన్నారు.




