Friday, 6 November 2026

కమిషనర్ ..తీరుతో విలిగిన గ్రామాల ప్రజలు విలవిల

కమిషనర్ ..తీరుతో విలిగిన గ్రామాల ప్రజలు విలవిల
జనం సాక్షి (సిరిసిల్ల టౌన్)
మున్సిపల్ కమిషనర్ తీరుతో సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గతంలో సిరిసిల్ల పట్టణంలో విలీనమైన రగుడు చంద్రంపేట ముష్టిపల్లి బోనాల సర్దాపూర్ పెద్దూరు గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ భూముlగుంట రెండు గుంటలు రైతులు తమ పిల్లల పెళ్లిల గురించి చదువుల గురించి నాలా కన్వర్షన్ చేసి విక్రయించుకుందామంటే మున్సిపల్ కమిషనర్ ఈ భూములు అక్రమ లేఔట్ కిందికి వస్తుందని సబ్ రిజిస్టర్ కు రిజిస్ట్రేషన్ చేయవద్దని లెటర్ పంపడంతో గత 25 రోజులుగా విలీన గ్రామాలకు చెందిన భూములు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఈ సమస్యలు స్థానిక కౌన్సర్లకు తెలిసిన పట్టించుకోవడంతో ప్రజలు ప్రజాప్రతినిధులపై విలీన గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
తమ సొంత భూములు విక్రయించుకుంటే నాలా కన్వర్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా రెండు రకాల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ తమ గ్రామాలపై కక్ష సాధింపు ధోరణి ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్లపై నిఘా ఉంచి అడ్డుకోవాల్సింది పోయి రైతుల భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ లెటర్ పంపడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోజు సబ్ రిజిస్టర్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు