హైదారాబాద్,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్ మ్యాప్‌పై రావాలని హైకమాండ్ సూచించిన నేపథ్యంలోనే రూట్‌మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సారయ్య తెలిపారు. రేపు ఎల్లుండి జానారెడ్డి నివాసంలో కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆక్షాంక్ష దానితో ముడిపడిన అంశాలతో నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణవాదులంతా తమ అభిప్రాయాలు తెలపవచ్చని చెప్పారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సమావేశం ఈనెల 12 న ఉండవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్రం ఈ నెల 17న ప్రకటన విడుదల చేసే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.




